ఎడపల్లిలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
ఎడపల్లి, సెప్టెంబర్ 17 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బుధవారం విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు విశ్వకర్మను ప్రపంచంలోనే మొదటి హస్తకలకారుడిగా పరిగణిస్తారని విశ్వ సృష్టిలోను బ్రహ్మకు సహాయపడ్డారని సంఘం సభ్యులు తెలిపారు ప్రతి సంవత్సరం విశ్వకర్మ జయంతిని ఘనంగా జరుపుకుంటామని తెలిపారు