నేడే మంగళ్ పాడ్ లో బతుకమ్మ పండుగ
ఏడపల్లి, సెప్టెంబర్ 24 ( లోకంతీరు ) :
ఏడపల్లి మండలంలోని మంగళ్ పహాడ్ గ్రామంలోనేడు (గురువారం) బతుకమ్మ పండుగవేడుకలను నిర్వహిస్తున్నారు. సందర్భంగా గ్రామపoచాయతీ కార్యదర్శి రామిరెడ్డి బతుకమ్మనిమజ్జనానికిఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.స్థానిక చెరువులో నిమజ్జనం చేసే బతుకమ్మ భక్తుల కొరకు ప్రధాన రహదారులన్నీ మరమ్మత్తులు చేయించారు. స్థానిక చెరువు కట్ట వద్ద మహిళాభక్తులకు ఇబ్బంది కలగకుండా ముల్ల పొదలను చెత్తాచెదా రాo లండి తొలగించిచదును చేయించారు.రంగురంగుల వీధిలైటును ఏర్పాటు చేశారు. మహిళలకు అతి ప్రీతి పండగైన పండగ రోజున అత్తింటి కోడల్లు, పుట్టింటి ఆడపడుచులు రావడంతో బతుకమ్మ పండగ వేడుకలుతొందరగా ఉంటుంది. ఏదేమైనప్పటికీగురువారం బతుకమ్మ వేడుకలను జరుపనున్నారు.