ఎడపల్లి మండలంలో వరి కోతలు ప్రారంభం
ఎడపల్లి, సెప్టెంబర్ 24 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. జైతపూర్ గ్రామానికి చెందిన రైతు కరటూరు వెంకటేశ్వరరావు వరి పంట కోతకు రావడంతో బుధవారం ఆయనకు ఉన్న ఏడు ఎకరాల వరి పంటను నూరుపిడి చేశారు. జైతాపూర్, తానాకలాన్ రెవెన్యూ శివారు ప్రాంతాలలో ఆయనకు వరి పంట పొలాలు కోతకు రావడంతో నూర్పిడి చేసినట్లు రైతు వెంకటేశ్వరరావు తెలిపారు. కొత్త రకమైన *కోనారం* పంటనువేయడంతో దిగుబడి బాగానేవచ్చిందని రైతు తెలిపారు.పకృతి వైపరీత్యాల వల్ల ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితి ఉండడం వలన రైస్ మిల్ కు విక్రయించినట్లు తెలిపారు.ఆలాగే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు వస్తుందో అనే విషయం ఇంకా ప్రకటన చేయకపోవడంవలనతాను పండించిన వరి ధాన్యాన్ని నూర్పిడి చేసి నిజామాబాద్ పట్టణంలోని ఓ రైస్ మిల్ కు ధాన్యాన్ని విక్రయించినట్లు ఆయన తెలిపారు. క్వింటాల్ ధాన్యానికిమూడు కిలోల తరుగు ఉందన్నారు.