వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రo ప్రారంభం
– సహకార సంఘం అధ్యక్షులు పోల మల్కా రెడ్డి ఎమ్మార్వో దత్తాద్రి
ఎడపల్లి, అక్టోబర్ 06 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో సోమవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసిల్దార్ దత్తాద్రి ఎడపల్లి మండల సహకార సంఘం అధ్యక్షులు పోల మల్కా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఏ గ్రేడ్ ధాన్యానికి 23 89 రూపాయలు,బి గ్రేడ్ (సన్న రకాల) ధాన్యానికి 2,3 69 రూపాయల మద్దతుధరనుప్రభుత్వం చెల్లిస్తుందన్నారు రైతులుపండించిన వరీ ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలుకేంద్రాలలోవిక్రయించి లాబాలుపొందాలని ఆయన రైతులను కోరారు.కోనుగోలుకేంద్రాలలోధాన్యానీ విక్రయించిన రైతులుపట్టాపాస్ పుస్తకం,ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ ప్రతులను కొనుగోలు కేంద్రాలలోని సిబ్బందికి అందజేయా లని ఆయన తెలిపారు.రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండానేరుగాప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించి లాభాలుపొందాలన్నారు. కార్యక్రమంలోఎడపల్లి సహకార సంఘం అధ్యక్షులుపోలమల్కరెడ్డి, కార్యదర్శి రాజారాం, పాలకవర్గం సభ్యులు చేపూర్ నగేష్ గౌడ్, బర్దిపూర్ ప్రవీణ్, సిబ్బంది ప్రభాకర్ గౌడ్, బేగారి సాయిలు, జగన్, శ్రీనివాస్, అశోక్ కుమార్,రాగి చెట్టుకింది సురేష్, తూట్కూర్ రవీందర్ రెడ్డి కంచరి శ్రీనివాస్ నాగేష్ అల్లడి శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు రైతులు,తదితరులుపాల్గొన్నారు.