అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

ఎడపల్లి , డిసెంబర్ 03 ( లోకంతీరు ) : ఎడపల్లిమండలంలోని జానకంపేట గ్రామంలో బాలాజీ వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ నిర్వహించారు. కార్యక్రమంలో రుక్మాయి గంగాధర్, నరసయ్య, మురళి, సందీప్ తదితరులు ఉన్నారు.