ఎన్నికల కోడ్ అమలు ఉన్నందున యువకులు గ్రామ పెద్దలు పోలీసులకు సహకరించాలి
– బోధన్ రూరల్ సిఐ విజయ్ బాబు

ఎడపల్లి, నవంబర్ 28 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రం ఆవరణ వద్ద ఎడపల్లి పోలీస్ సిబ్బంది శుక్రవారం బందోబస్తు నిర్వహించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నామినేషన్ దాఖలు చేసే వ్యక్తులు మాత్రమే కేంద్రంలోకి వెళ్లాలని పోలీసులు తెలిపారు. పంచాయతీ ఆరుబయట గ్రామానికి చెందిన యువకులు గుంపులు గుంపులుగా కనబడడంతో బోధన్ రూరల్ సిఐ విజయ్ బాబు అక్కడికి చేరుకొని అక్కడ ఉన్న యువకులను పంపించేశారు. ఎన్నికల కోడ్ అమలు ఉన్నందున యువకులు గ్రామ పెద్దలు పోలీసులకు సహకరించాలని ఆయన అన్నారు. అంతకుముందుగా ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ మండలంలోని తొమ్మిది పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా రెండో రోజు కూడా నామినేషన్లు ప్రశాంతంగా జరిగాయి.