ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డిని సన్మానించిన ఎడపల్లి మండల్ కాంగ్రెస్ నాయకులు

ఎడపల్లి, అక్టోబర్ 03 ( లోకంతీరు ) : బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు, పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ సలహాదారునిగా నియమించడం పట్ల ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేసి, ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డి నీ ఆయన నివాసంలో నాయకులు కలిసి సన్మానించిన అనంతరం అభినందించిశుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్ర క్యాబినెట్ హోదా ను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కల్పించడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రివర్గ, సమావేశంలో కానీ,ప్రభుత్వం చేపట్టనున్న సంక్షేమ ఫలాలు, అభివృద్ధికార్యక్రమాల్లో,రాష్ట్రమంత్రులతో పాటు ప్రభుత్వ సలహాదారులుగా నియామకమైన పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా మాట్లాడే అవకాశం సమీక్ష సమావేశంలో చోటుక ల్పించడంహర్షినియమన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్గౌడ్కు, మంత్రులకు,ఎంపీలకుఎమ్మెల్యేలకు,ఏడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ సలహాదారున్ని కలిసిన వారిలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బిల్లా రామ్మోహన్, యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ్ర సంజయ్, మాజీ సర్పంచులు పాల్ద భాస్కర్రెడ్డి, యువకులు తూట్కూర్ రవీందర్ రెడ్డిఅమానుల్లా షరీఫ్,పిస్కా గంగా ప్రసాద్, ఎల్లయ్య యాదవ్, దళిత రత్న అవార్డు గ్రహీత, సూర్యకాంత్ వాగ్మా రే,నాయకులు బుడ్డా పోశెట్టి, నీ రెడీ రవికుమార్,సరి దాస్,రాధా కిషన్ గౌడ్, ఎడపల్లి గ్రామ అధ్యక్షులు బంజ కామప్ప, నాయిని బలరాం, రెడ్డి ,నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు.