Take a fresh look at your lifestyle.

ఎంఈఓ కు ఎమ్మెల్సీ పరామర్శ…..

0

ఎంఈఓ కు ఎమ్మెల్సీ పరామర్శ

హైదరాబాద్, ఆగస్టు 17 ( లోకంతీరు న్యూస్ ) : ఉట్నూర్ మండల విద్యాధికారి రాపెళ్లి ఆశన్నకు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పరామర్శించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి లక్డీకాపూల్‌లోని గ్లెనెగల్స్‌ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల విద్యాధికారి రాపెళ్లి ఆశన్నను బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పరామర్శించి,ఆశన్నను ఆసుపత్రిలో కలుసుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆశన్నకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందిస్తూ త్వరగా కోలుకునేలా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని వైద్యులను ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సూచించారు.ఆశన్న కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ వారికి ధైర్యం చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని, ఆశన్న త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లో చేరాలని ఆకాంక్షించారు.విద్యా రంగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు, ఉపాధ్యాయుల ఆరోగ్యం, సంక్షేమం పట్ల ప్రభుత్వం, సంబంధిత శాఖలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర అధ్యక్షులు వోడ్నాల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.