కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు ప్రారంభం

కామారెడ్డి, నవంబర్ 09 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలోని ఇసన్నపల్లి – రామారెడ్డి గ్రామాలలో కొలువై ఉన్న ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అధికార భైరవ స్వామి జన్మదిన వేడుకలు ఆదివారం నుండి ప్రారంభం ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం 6 గంటలకు గణపతి పూజ పుణ్యాహవాచనం,కంకణ ధారణ సంతత ధారాభిషేకం, స్వామివారి కి అభిషేకాలు, మధ్యాహ్నం శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు అంగరంగ వైభవంగా తీయడం జరిగింది. తదుపరి భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇట్టి కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి ప్రభు రాంచంద్రం, అర్చకులు శ్రీనివాస్ శర్మ , జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, నాగరాజు, భరత్, ఆలయ సిబ్బంది. ఇరు గ్రామాల ప్రజలు ప్రజలు భక్తులు పాల్గొన్నారు.