బోధన్-జిల్లాస్థాయి ఇన్స్పైర్ & సైన్స్ ఫెయిర్ ప్రదర్శన
ఎడపల్లి, నవంబర్ 09 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇన్స్పైర్ (2024–25) మరియు సైన్స్ ఎగ్జిబిషన్ (2025–26) ప్రదర్శనలు నవంబర్ 23 నుండి 25 వరకు బోధన్ లోని విజయ మేరీ పాఠశాలలో నిర్వహించబడనున్నాయి ఈ ప్రదర్శనలు ఎస్సీఈ ఆర్టీ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పి. అశోక్ తెలిపారు జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ విద్యార్థులకు సబ్ థీమ్స్ కి అనుగుణంగా ప్రదర్శనలో పాల్గొనేల ప్రోత్సహించాలని సూచించారు 6వ తరగతి నుండి8వ తరగతి వరకు జూనియర్ విభాగం. 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు సీనియర్ విభాగంగా విభజించి ప్రదర్శనలు నిర్వహించబడతాయి ఇన్స్పైర్ అవార్డు 2024–25 కోసం జిల్లాలో 119 మంది విద్యార్థులు ఎంపికయ్యారు వారి ఖాతాలలో పదివేలు చొప్పున జమ చేయబడింది ఈ విద్యార్థులు కూడా సైన్స్ ఫెయిర్ లో పాల్గొనున్నారు విద్యార్థులు సామాజిక ప్రయోజనకరమైన సైన్స్ మోడల్స్ రూపొందించి ప్రదర్శనలో చురుకుగా పాల్గొనాలని అధికారులు సూచించారు.