Take a fresh look at your lifestyle.

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా పోటీలు….

0

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా పోటీలు

ఎడపల్లి, నవంబర్ 12 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ వాగ్దేవి పాఠశాలలో బుధవారం లయాన్స్ క్లబ్ ఎడపల్లి ఆధ్వర్యంలో పాఠశాల బాల బాలికలకు క్రీడ పోటీలను నిర్వహించారు.ఈనెల 14న (బాలల దినోత్సవం),జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా పోటీలను నిర్వహించినట్లు లయన్ జి ఈ టి సూర్యనారాయణ తెలిపారు. బాల బాలికలకు పరుగు పందెం, ఇటుకల, కుర్చీలాట, ఆడిపించినట్లు ఆయన తెలిపారు. వివిధ క్రీడ పోటీలో గెలుపొందిన బాలబలికలకులయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి ఆధ్వర్యంలో నవంబర్ 14వ తేదీన బహుమతుల ప్రధాన ఉంటుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిఈటి సూర్యనారాయణ, శ్రీ వాగ్దేవి పాఠశాల కరస్పాండెంట్, లయన్ మాజీ అధ్యక్షులు నార్ల కాశీనాథ్ గుప్తా, లయన్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి అధ్యక్షులు పుష్ప లత, కార్యదర్శి మెర్సి, కోశాధికారి శంకర్, పి ఆర్ ఓ రాకేష్ వర్మ, కదం ప్రకాష్ రావు, మనోజ్ కుమార్, గంగారెడ్డి తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.