మంగళ్ పహాడ్ లో ప్రతాప్ గౌడ్ అంత్యక్రియలు

ఎడపల్లి, నవంబర్ 12 ( లోకంతీరు ) : నిజాంబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్పహాడ్ గ్రామానికి చెందిన చేపూరి ప్రతాప్ గౌడ్ (31) సోమవారం మంగళ్ పహాడ్, తానాకాలన్ గ్రామ రెవెన్యూ శివార్ల మధ్యలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడంతో అతని కుటుంబీకులతో పాటు గ్రామస్తులు ఆవేదన గురయ్యారు.ప్రతాప్ గౌడ్ కు గురువారంరోజు పెళ్లి కావాల్సి ఉంది. ఒకసారి గా ఆయన ఆత్మహత్య చేసుకోవడం పట్ల కారణం ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారిందనీ కుటుంబీకులతో పాటు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో అందరితో కలుపుగోలు తరంగా ఉండే ప్రతాప్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడ ని గ్రామంలో తెలవగానే మృతుని కుటుంబీకులు, గ్రామస్తులు గ్రామ పెద్దలు యువకులు అతని మిత్రులు బంధువులు రోధనాలు చేశారు. బుధవారం మధ్యాహ్నం ప్రతాప్ గౌడ్ అంత్యక్రియల ను కుటుంబీకులు నిర్వహించారు. అంతిమయాత్రలో బంధువులు, తాజామాజీ ప్రజాప్రతినిధులు, స్నేహితులు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు భారీ ఎత్తున మృతుని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. చివరికి కన్నీటి వీడ్కోలు పలికారు. చేపూరి ప్రతాప్ గౌడ్ ఇకలేరు అని అతని కుటుంబీకులు, మహిళలు, స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు బోరున విలపించారు. గ్రామంలో అందరితో కలుపుగోలుతానంగా ఉండే చేపూరి ప్రతాప్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. చేపూరి ప్రతాప్ గౌడ్ కు ఆయన ఆత్మకు పవిత్ర శాంతి కలగాలని ఆ భగవంతున్ని వేడుకున్నారు. మృతిని కుటుంబ సభ్యులకు, బంధువులు, గ్రామస్తులు, యువకులు, స్నేహితులు ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు.