Take a fresh look at your lifestyle.

ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుదర్శన్ రెడ్డికి ఘన స్వాగతం…..

0

ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుదర్శన్ రెడ్డికి ఘన స్వాగతం

ఎడపల్లి, నవంబర్ 14 ( లోకంతీరు ) : మాజీ మంత్రి , బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు,పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ప్రభుత్వముఖ్య సలహాదారులుగా నియామకమై మొట్టమొదటిసారిగా బోధన్ నియోజకవర్గానికి విచ్చేసిన శుభ సందర్భంగా ఎడపల్లి మండల పరిధిలోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల కళాశాలను ఆయన సందర్శించారు. ముఖ్య సలహాదారునికి పాఠశాల తొలిసారిగా రావడంతో పాఠశాల ఉపాధ్యాయులు బాల బాలికలు ఘన స్వాగతం పలికారు.పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు శాలువలతో సన్మానించి బొక్కేను అందజేశారు.14 నవంబర్ జవహర్లాల్ నెహ్రూ జన్మదిన సందర్భంగా పాఠశాలలో బాలికలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.బాలికలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలు పలువురిని ఆకర్షింపజేశాయి. అనంతరం ప్రభుత్వ ముఖ్య సలహాదారులు ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి పాఠశాల, కళాశాలలోని బాలికల చదువు, బాలికలకు అందిస్తున్న భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. భోజనం తో పాటు చదువు కూడా బాగుందని బాలికలు ముఖ్య సలహాదారునికి వివరించారు. పదవ తరగతి, ఇంటర్ చదువుతున్న బాలికలు 100 శాతం మార్కులు తెచ్చుకోవాలని పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి బాలికలను ఆకాంక్షించారు. చదువులో వెనుకబడ్డ బాలికలను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులను నిర్వహించాలని ఉపాధ్యాయులను సూచించారు. 2024_ 25 విద్యా సంవత్సరంలో పదవ తరగతి, ఇంటర్ బాలికలు రాష్ట్రస్థాయి,జిల్లా స్థాయి మండల స్థాయిలో మంచి ర్యాంకులు సాధించి కళాశాలకు పాఠశాలకు మంచి పేరు తెచ్చారని పాఠశాల కరస్పాండెంట్ గంగ శంకర్ ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డికి తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ గంగా శంకర్ తో పాటు ఉపాధ్యాయులను ప్రభుత్వ ముఖ్య సలహాదారులు ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాలికలు చదివితేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని చదువుతోపాటు ఆటలు పాటలు క్రీడ రంగాలలో పాల్గొని పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్ రావు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బిల్లా రామ్మోహన్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఈరెంటి లింగం, ఎడపల్లి తాసిల్దార్, తాసిల్దార్ కార్యాలయ అధికారులు సిబ్బంది, మండల కోశాధికారి బొబ్బిలి శ్రీనివాస్, ఎడపల్లి మాజీ సర్పంచ్ శంకర్ నాయుడు, కిసాన్ కేత్ మండల అధ్యక్షులు శివరాం ప్రసాద్, మైదం ప్రతాప్ రెడ్డి,మ మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.