ఎడపల్లి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు![]()
ఎడపల్లి, నవంబర్ 14( లోకంతీరు ) : లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి క్లబ్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం లో భాగంగా నవంబర్ 9వ తారీకు నుండి 14వ తారీకు వరకు ఎడపల్లి మండలం లోని జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్ ఉర్దూ మీడియం స్కూల్, మంగల్ పహాడ్, కుర్ణపల్లి, తానకలాన్, జనకంపెట్, నెహ్రూనగర్, పోచారం, జైతాపూర్, ఏఆర్పీ క్యాంప్ యూపీఎస్, అంభం (వై) యూపీఎస్, మాధవి స్కూల్, ఎడపల్లి ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ ఎడపల్లి మండలం లోని గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు మరియు ఎడపల్లి లోని వాగ్దేవి స్కూల్ లో వ్యాస రచన, డ్రాయింగ్, ఉపన్యాస మరియు ఇతర పోటీలు నిర్వహించి అందులో గెలిచినవారికి ప్రోత్సాకారం తో పాటు లయన్స్ ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ లు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎడపల్లి క్లబ్ సీనియర్ లయన్ మెంబర్ జిల్లా జిఈటీ కో ఆర్డినటర్ లయన్ కరుటూరి సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్నారని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్య బోధన చేస్తున్నారని పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలని ఇంతటి ప్రావిణ్యం కనబరిచిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు లైన్స్ క్లబ్స్ ఎప్పుడు విద్యార్థులకు ముందు నడిపించే దాని కొరకు వెంట ఉంటుంది అని వారికి హామీ ఇచ్చారు ఈయొక్క కార్యక్రమాలలో క్లబ్ సభ్యులు లయన్స్ సయాల మెర్సీ, సీఎచ్ గంగారెడ్డి, ప్రకాష్, శంకర్, మనోజ్, కాశినాథ్, రాకేష్ వర్మ మరియు అన్ని పాఠశాలలు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం పాలుగొన్నారు.
