Take a fresh look at your lifestyle.

యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు….

0

యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు

– పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

ఎడపల్లి, నవంబర్ 17 ( లోకంతీరు ) : యువత సన్మార్గంలో నడిచినప్పుడు దేశ భవిష్యత్తు బాగుంటుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు బోధన్ డివిజన్ పరిధిలోని బోధన్ రూరల్ ఎడపల్లి రెంజల్ పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమంలో జిల్లా పోలీస్ ట్రైనింగ్ మైదానం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదు యువకులని నైతికంగా శరీరకంగా మానసికంగా బలంగా తీర్చిదిద్దే ఒక మంచి సాధనంగా కూడా భావించాలని అన్నారు మన సమాజంలో యువత పెద్ద ఎత్తున మత్తు పదార్థాల వైపు ఆకర్షితమవుతుందన్నారు ఇది ఒక ప్రమాదకరమైన మార్గం ఒక్కసారైనా ఆ వ్యసనాల్లోకి అడుగుపెడితే జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకోని ప్రమాదం ఉందని తెలిపారు యువత దేశ భవిష్యత్తు మీరు ఆరోగ్యంగా ఉంటూ మంచి ఆశయాలతో పట్టుదలతో ముందుకు సాగాలని ఇలాంటి క్రీడ కార్యక్రమాలు మీకు సానుకూలమైన దారిలో దిశా నిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో వ్యాసరచన పోటీలలో గెలుపు పొందినటువంటి విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో బోధన్ ఎసిపి శ్రీనివాస్ బోధన్ రూరల్ సీఐ విజయబాబు రుద్రూర్ సీఐ కృష్ణ ఎడపల్లి మండల ఎస్సై ముత్యాల రామ బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి రెంజల్ ఎస్సై చంద్రమోహన్ కోటగిరి ఎస్సై సునీల్ 26 జట్ల క్రీడ కారులు యువత బోధన్ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.