Take a fresh look at your lifestyle.

విద్యార్థులకు దంత సంరక్షణ పైఅవగాహన….

0

విద్యార్థులకు దంత సంరక్షణ పై అవగాహన

ఎడపల్లి, నవంబర్ 17 ( లోకంతీరు ) :  దంతాలను బ్రేష్ తో శుభ్రంగా తోముకున్నప్పుడే దంతాలు బాగుంటాయని, దుర్వాసన రాదని, సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎంఎన్ఆర్ దంత కళాశాల విద్యార్థిని మల్క రిషిత అన్నారు ఎడపల్లి మండలంలోని.ఏఆర్పి క్యాంపు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం దంత సంరక్షణపై సంగారెడ్డి లోని ఎంఎన్ఆర్ దంత కాలేజీకి చెందిన దంత విద్యార్థిని మల్క రిషిత ఆధ్వర్యంలో దంత సంరక్షణ పై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు దంతాల సంరక్షణ ప్రాముఖ్యతపై రిషిత వివరించారు. తర్వాత పాఠశాలలోని 70 మంది విద్యార్థులకు టూత్‌ బ్రష్‌లు, పేస్ట్‌లను అందజేశారు. కార్యక్రమంలో స్థానికులు మల్క స్వామి,మహబూబ్, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.