Take a fresh look at your lifestyle.

ఎడపల్లిలో కన్న తండ్రి కన్న కుమార్తె పై లైంగిక దాడి…..

0

ఎడపల్లిలో కన్న తండ్రి కన్న కుమార్తె పై లైంగిక దాడి 

ఎడపల్లి , నవంబర్ 20 ( లోకంతీరు ) :  ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 13 సంవత్సరాల బాలికపై కన్న తండ్రి లైంగిక దాడికి పాల్పడిన ఘట్టం వెలుగులోకి వచ్చింది స్థానికంగా అందించిన సమాచారం మేరకు సదరు వ్యక్తి గత కొంతకాలంగా తన కన్న కూతురుపై అసభ్యంగా ప్రవర్తిస్తూ శరీరకంగా వేధింపులకు పాల్పడుతున్నాడు కన్నతల్లి ప్రశ్నించగా ఆమెపై కూడా దాడి చేసి బెదిరించినట్లు తెలుస్తోంది కొన్ని రోజుల క్రితం తల్లి ఇంట్లో లేని సమయంలో బాలికపై దారుణం జరిపి ఈ విషయాన్ని ఎవరికి చెప్పవద్దని బెదిరించాడు అయినా ఈ ఘటన భయంతో కూతురు తల్లికి చెప్పిన పరువు పోతుందనే ఆలోచనతో ఈ విషయాన్ని బయట పెట్టలేదు కాగా ఇటీవల రాత్రి సమయంలో మళ్లీ బాలికపై లైంగిక దాడి జరగడంతో నిద్రలో మేల్కొన్న భార్య అడ్డుకునే ప్రయత్నంలో ఆమెను కూడా బెదిరించాడని ఈ దుర్మార్గపు చర్య అధికమయ్యే అవకాశం ఉండడంతో బాలిక తల్లి ఎడపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు ఈ విషయంపై ఎడపల్లి ఎస్సై ముత్యాల రమకు సంప్రదించగా విచారణ కొనసాగుతుందన్న వివరాలు వెల్లడించలేమని తెలిపారు బాలికల భద్రత కోసం ఇలాంటి సంఘటనల వ్యక్తిగత వివరాలు వెల్లడించడం లేదని తెలిపారు బాలికల భద్రత కోసం ఇలాంటి సంఘటనల వ్యక్తిగత వివరాలు గోప్యతపాటించిన దుర్మార్గపు ఇలాంటి ఘటన చర్యలు దాచకుండా చట్టపరమైన చర్యలు ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు అప్పుడే ప్రజలు తగిన చర్యలతో భద్రతగా ఉండే ప్రయత్నం చేస్తారని సామాజిక వర్గాలు సూచిస్తున్నాయి ఈ మేరకు ఎడపల్లి పోలీసులు సదర్ వ్యక్తిపై అతనిపై పోక్స్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.