రైతుల పక్షాన మాట్లాడితే కేసులు పెట్టిస్తారా..!
– మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్

కామారెడ్డి , నవంబర్ 21 ( లోకంతీరు ) : రామారెడ్డి మండలానికి గురువారం పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్కని సన్న వడ్లకు బోనస్ ని ఇవ్వాలని అడగడానికి వచ్చిన రైతులతో ప్రవర్తించిన తీరును మరియు రైతులతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండించిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, శుక్రవారం రామారెడ్డి మండలానికి చేరుకుని కొనుగోలు కేంద్రంలోని రైతులతో మాట్లాడడం జరిగింది. వరి కోత తర్వాత కొన్ని చాలా ధాన్యం నిలువ ఉండడం వలన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రైతులు, రైతుల పక్షాన బిఆర్ఎస్ నినేతలు కలిసి తమ సమస్యలను విన్నవించడానికి వినతి పత్రం అందజేయు తరుణంలో మంత్రి సీతక్క ఆవేశంతో రైతుల పట్ల కర్కశంగా ప్రవర్తించి రైతుల బాధలను వినకుండా మీరు అసలు రైతులేనా, మీరు రైతులు కారని తాగి వచ్చి కావాలనే నన్ను అడ్డుకుంటున్నారని దూషిస్తూ అక్కడున్న రైతులపై కేసు పెట్టించడం జరిగింది.రామారెడ్డి రైతులను కలిసిన మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ రైతులకు బిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నాడు కెసిఆర్ ప్రభుత్వం లో రైతును రాజు చేశారు.రైతులు పండించిన పంటలను సకాలంలో కొని వారి ఖాతాలలో డబ్బులను వారంలోపే జమ చేసేవారని గుర్తు చేసారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నికల సమయంలో తప్ప రేవంత్ రెడ్డికి రైతుల బాధలు కనబడవని ఆగ్రహం వ్యక్తం చేసారు. అమలు కాని హామీలను ఇచ్చి రైతులను మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కాక రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. రామారెడ్డి మండల పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్క రైతుల పట్ల ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండిస్తూ వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆరుగురుపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని మరియు వెంటనే సన్న వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, పడిగల శ్రీనివాస్, రెడ్డి మల్లేష్, తొత్తుల గంగారం, జంగం లింగం,బానూరి నర్సారెడ్డి, లాగాల మైపాల్,బిఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.