Take a fresh look at your lifestyle.

నేడే శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వేలం పాట….

0

నేడే శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వేలం పాట

ఎడపల్లి, నవంబర్ 27 ( లోకంతీరు ) :  ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో రెండు సంవత్సరాల కొరకు సైకిల్ స్టాండ్ పూజ సామాగ్రి కొబ్బరికాయలు నవధాన్యాలు లడ్డు పులిహోర అమ్ముకొనుటగాను ఈనెల 28 శుక్రవారం ఉదయం 11 గంటలకు దేవదయ ప్రాంగణంలో బహిరంగ వేళ వేయుటకు నిర్ణయించినట్లు ఆలయ నిర్వహణ అధికారి గింజుపల్లి వేణు తెలిపారు ఈ వేలం పాటలో పాల్గొనేవారు 5000 వేల రూపాయల డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలని వ్యాపారస్తులకు కోరారు ఈ యొక్క వేలము తేదీ1. 2.2026 నుండి 31.1.2028 వరకు ఉంటుందని అన్నారు ఈ యొక్క రెండు సంవత్సరాలు (2026) సంవత్సరం వచ్చే జాతర బ్రహ్మోత్సవాలు 2027వ సంవత్సరంలో వచ్చే జాతర బ్రహ్మోత్సవాలలో నాలుగు రోజులు శనివారం అమావాస్య వచ్చే రోజులలో వ్యాపారస్తులకు వ్యాపారం చేసే అవకాశం లేదు ఈ రెండు సంవత్సరాల్లో మిగతా అన్ని రోజులలో యధావిధిగా వ్యాపారం కొనసాగించవచ్చని ఆలయ కమిటీ ఈవో వేణు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.