Take a fresh look at your lifestyle.

అంగరంగ వైభవంగాఎడపల్లి గ్రామంలో బోనాలతోఘనంగా నల్లపోచమ్మ పండగ…..

0

అంగరంగ వైభవంగాఎడపల్లి గ్రామంలో బోనాలతోఘనంగా నల్లపోచమ్మ పండగ.

– బోనాలతో బయలుదేరిన మహిళా భక్తులు 

ఎడపల్లి, మార్చి 01 ( లోకంతీరు ) : ఎడపల్లి గ్రామంలో అన్ని కులస్తులు. ఆధ్వర్యంలో నల్ల పోచమ్మ పండుగను భాజా భజంత్రీలతో మంగళహారతిలతో. మరియు బోనాలతో మొట్టమొదట ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన గ్రామ పెద్ద అయినటువంటి దేశాయి బాబాఇంటి నుండి పోచమ్మ తల్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. తరువాత గ్రామంలోని అన్ని కులస్తులు అందరూ కలిసి భాజా భజంత్రీల మధ్య వారి ఇంటి నుండి బోనాలతో పాటు అమ్మవారికి నైవేద్యం పెట్టి మేకపోతులను బలి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆడపడుచులు బోనాలతో మంగళ హారతులతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్ని కులాల గ్రామ పెద్దలు మరియు యువకులు. మహిళలు. చిన్నపిల్లలు బంధువులతో కలిసి రావడంతో ఎడపల్లి గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.

Leave A Reply

Your email address will not be published.