నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి వివరాలు వెల్లడి…
నిజామాబాద్ , నవంబర్ 30 ( లోకంతీరు ) : నకిలీ బంగారం అమ్ముతూ అమాయకులను మోసం చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఈ మేరకు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు , స్వర్ణ భారతి కాలనీ చెందిన అంజమ్మ లేబర్ పని చేసుకుంటూ జీవిస్తుంటారు. అయితే నకిలీ బంగారాన్ని అంటగట్టి డబ్బు సంపాదించాలనే ఆలోచనతో వారు మూడు నకిలీ బంగారు బిస్కెట్లను నిజామాబాద్‌కు తీసుకొచ్చారు. నగరంలోని శివాజీనగర్‌లో ఒక ఇంటి ని అద్దెకు తీసుకుని వాళ్ళ దగ్గర గల నకిలీ బంగారాన్ని అమ్మే ప్రయత్నంలో సీతారాంనగర్ కాలనీ కు చెందిన మోర వనిత మిల్క్ షాప్ యందు పాలు కొనే నెపంతో పలుమార్లు సంప్రదించి వారు తమ దగ్గర గల బంగారంలో ఒక బిస్కెట్ చూపించి ఇది 350 గ్రాములు ఉంటుందని, దీనిని బయట అమ్మితే రూ.35 లక్షలు లభిస్తాయని ఆమెను నమ్మించారు.కానీ తమకు రూ.10 లక్షలు ఇస్తే చాలని చెప్పారు.దానికి వారు అంత డబ్బు ఇవ్వలేము అని చెప్పి ఐదు లక్షలు ఇస్తామని చెప్పగా దానికి నిందితులు సరేనని ఐదు లక్షల రూపాయలు తీసుకొని అక్కడి నుండి ఊడాయించారు.మోర వనిత ఆ బంగారు బిస్కెట్ బిస్కెట్‌ను తనిఖీ చేయించగా అది నకిలీదని తేలడంతో తాను మోసపోయానని గుర్తించి ఐదో టౌన్ పోలీసులకు పోలీసులను ఆశ్రయించగా వారు సమాచారం తెలుసుకొని యేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించి అన్ని కోణాలలో విచారించగా సదరు ముఠా డిచ్‌పల్లిలో ఉన్నట్లు గుర్తించారు. నిందితులైన గుంటూరుకు చెందిన తురక శివయ్య, తన్నీరు అంజమ్మ, తన్నీరు అంకమ్మ, తన్నీరు గంగరాజును అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.5 లక్షల నగదు, 960 గ్రాముల నకిలీ బంగారం స్వాధీనం చేసుకున్నారు.ఇట్టి కేసు చేధనకు నిజామాబాదు డివిజన్ అసిస్టెంట్ కమీషనర్ అఫ్ పోలీస్ ఎల్.రాజా వెంకట్ రెడ్డి అధ్వర్యంలో రెండు టీం లుగా ఏర్పడి బి.శ్రీనివాస్ నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్,ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ దర్యాప్తు అధికారులుగా వ్యవహరించారు.నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బంది అందరిని ఎల్.రాజా వెంకట్ రెడ్డి ,అసిస్టెంట్ కమీషనర్ అఫ్ పోలీస్ నిజామాబాదు అభినందిoచారు.