సుదర్శన్ రెడ్డి ని కలిసిన ఉప సర్పంచ్ల ఫోరం

ఎడపల్లి , ఫిబ్రవరి 08 ( లోకంతీరు ) : గ్రామాలు అభివృద్ధి చెందాలంటే సర్పంచ్, ఉప సర్పంచ్లతో పాటు పాలకవర్గం సభ్యులు పాత్ర చాలా ముఖ్యమని నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎడపల్లి మండల ఉప సర్పంచ్ సమైక్య ఆధ్వర్యంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సర్పంచులుగా ఉప సర్పంచ్గా వార్డు సభ్యులు అత్యధిక మెజారిటీతోగెలవడం అభినందనీయం అన్నారు. అలాగే బోధన్ నిజామాబాద్ లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా తమ పార్టీ అభ్యర్థులు అత్యధికంగా గెలుస్తారని ఆయన ఆశ భావం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ లను కౌన్సిలర్లను గెలిపించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులపై ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను కూడా కాంగ్రెస్ పార్టీ వారి గెలుపొందుతారని ఆయన అన్నారు. ఉప సర్పంచ్ల సమైక్య ఎడపల్లి మండల అధ్యక్షులుగా మచ్కూరి గంగాధర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి అభినందించారు.