ఏ ఆర్ పి క్యాంప్ గ్రామంలో జోరుగా ప్రచారం

ఎడపల్లి , డిసెంబర్ 05 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం ఏ ఆర్ పి క్యాంప్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న తనను ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతోసర్పంచ్ గా గెలిపించాలని కోరుతూ అబ్దుల్ మహమూద్ శుక్రవారం ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు తాను గెలిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఆయన వెంట స్థానిక నాయకులు మల్కసమి, మైముద్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.