ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

నిజామాబాద్ , ఆగష్టు 15 ( లోకంతీరు న్యూస్ ) : స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ లోని ఇండియన్ రెడ్ క్రాస్ భవనం పై జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు జెండాను ఎగురవేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలన బారి నుండి 1947 ఆగస్టు 15 న భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిందని ,ఈ రోజు భారత పౌరులుకు ఏంతో ప్రాముఖ్యత ఉందని , ఎందుకంటే మనకు ఒక అందమైన మరియు ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వడానికి వారి జీవితాలను త్యాగం చేసిన స్వతంత్ర సమరయోధులను గుర్తుంచుకోవడానికి మాకు అవకాశం ఇస్తుందని .నేతాజీ సుభాష్ చంద్ర బోస్ , జవహర్లాల్ నెహ్రు , మహాత్మా గాంధీ ,సర్దార్ వల్లభాయ్ పటేల్ ,బాల గంగాధర్ తిలక్ , భగత్ సింగ్ మరియు చంద్రశేఖర్ ఆజాద్ భారత దేశంలో గొప్ప స్వతంత్ర సమరయోధులని కొనియాడారు .ఈ కార్యక్రమంలో సెక్రటరీ గోక అరుణ్ బాబు,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ ,మెడికల్ ఆఫీసర్ డా.రాజేష్ ,పి.ఆర్.ఓ బి.రామకృష్ణ , మరియు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు