Take a fresh look at your lifestyle.

ఆశీర్వదించండి గ్రామ అభివృద్ధికి ఎల్లవేళల కృషి చేస్తా……….

0

ఆశీర్వదించండి గ్రామ అభివృద్ధికి ఎల్లవేళల కృషి చేస్తా

  • సర్పంచ్ అభ్యర్థి బట్టు అనిత బాబయ్య, 

ఎడపల్లి , డిసెంబర్ 07 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం, మంగళ్ పహాడ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నందున తనను గ్రామస్తులు ఆదరించి మీ అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుకే వేసి తనను గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి బట్టు అనిత బాబయ్య ఓటర్లను అభ్యర్థించారు. ఆదివారం ఆమె ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటా ప్రచారం చేస్తూ బొట్టు పెడుతూ మహిళలకు తనను గెలిపించాలని ఆమె వేడుకున్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తానని ఆమె ఓటర్లకు హామీ ఇచ్చారు. సర్పంచ్ అభ్యర్థి బట్టు అనిత వెంట బట్టు బాబయ్య, బట్టు హనుమాన్లు, నాగబోయి గంగాధర్, మచ్చ రవి, మచ్చ రాములు, సుండు భూమయ్య, ఓటర్లు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.