సర్పంచ్ గా గెలిపించండి నిజమైన మార్పు చూపిస్తా

ఎడపల్లి , డిసెంబర్ 07 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తాను పోటీలో ఉన్నందున గ్రామ పెద్దలు యువకులు, మహిళలు తనను ఆదరించి మీ అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుకే వేసి నన్ను గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి కోమటి సత్యం ఓటర్లను వేడుకున్నారు. ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటా తిరుగుతూ ఓటు వేయాలని ఆయన కోరారు. గ్రామ అభివృద్ధికి తాను కృషి చేస్తానన్నారు. క్రితంలో తన సతీమణి గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ గా పనిచేసిన సమయంలో తమ వంతుగా గ్రామ అభివృద్ధికి చేసిన సేవలు ప్రజలకు, గ్రామస్తులకు గుర్తున్న విషయమే, ప్రస్తుతం తాను సర్పంచ్ గా బరిలో ఉన్నందున తనను గెలిపిస్తే వడ్డపల్లి గ్రామాన్ని మండలంలో, ఆదర్శవంత గ్రామంగా తీర్చి దిద్దుతామన్నారు. ఓటర్లు ఆదరించి తనను గెలిపించాలని ఆయన వేడుకున్నారు. ఆయన వెంట తాజా మాజీ ఉప సర్పంచ్ విజయలక్ష్మి, తదితరులు ఉన్నారు.