Take a fresh look at your lifestyle.

తొలిసారిగా ఎర్రకోటపై వందేమాతరం…..

0

తొలిసారిగా ఎర్రకోటపై వందేమాతరం

– విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్  , ఆగష్టు 12 ( లోకంతీరు న్యూస్ ) : తొలిసారిగా ఎర్రకోటపై వందేమాతరం గీతాలాపన చేయడం శుభ సూచికమని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. సంస్కార భారతి, ట్రస్మా సంయుక్త ఆధ్వర్యంలో వందేమాతరం 150 సంవత్సరాల ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన సమయంలో వందేమాతరం నినాదం ఒక ఉద్యమ శక్తిగా మారింది అన్నారు జైలు శిక్షలు నాటి దెబ్బలు తూటాలు ఎదురైన స్వాతంత్ర సమరయోధులు ఈ నినాదాన్ని విడిచిపెట్టలేదన్నారు. 150 ఏళ్ల చరిత్రలో ఒక గొప్ప ప్రయాణం వందేమాతరందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వందేమాతరంపై పలు అంశాలపై పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అలాగే కళాభారతి సంబంధించి ఇప్పటికే అనేకసార్లు మంత్రుల దృష్టికి తీసుకెళ్లాం అన్నారు. అరకొర నిధుల విడుదలతో ముందుకు సాగడం లేదని తెలిపారు. అంతకుముందు విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సంస్కార భారతి అధ్యక్షులు రాజకుమార్ సుభేదర్, ట్రస్మా అధ్యక్షులు కిషోర్, బీజేపీ కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, జ్యోతి మురళి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.