Take a fresh look at your lifestyle.

ప్రమాణస్వీకారం చేసిన మంగళ్ పాడ్ సర్పంచ్………

0

ప్రమాణస్వీకారం చేసిన మంగళ్ పాడ్ సర్పంచ్

ఎడపల్లి , డిసెంబర్22 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలో సోమవారం గ్రామపంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్లతోపాటు వార్డు సభ్యులు అధికారికంగా ప్రమాణ స్వీకరణం చేసి నఅనంతరంబాధ్యతలుస్వీకరించారూ ప్రత్యేక అధికారులు నూతనంగా నియామకమైన పాలకవర్గంచే ప్రమాణస్వీకరణ చయించిన అనంతరం వారిని పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.ఎడపల్లి మండలం,మంగళ్పహాడ్ గ్రామపంచాయతీ సర్పంచ్ చేపూరి వీణ శ్రీనివాస్ గౌడ్, ఉపసర్పంచిగా బట్టు బాబయ్య, వార్డు సభ్యులుగా శ్రీనివాస్ గౌడ్ , ఎర్రోళ్ల సాయమ్మ,గాండ్ల స్రవంతి, దెగ్లూర్సుమన్, బుడ్డ అబ్బయ్య, ఓం .గంగా ప్రసాద్, జీడి సౌమ్య, సూర కత్తి స్వప్న, బండ అభిలాష్ లు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సన్మాన సభ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బిల్లా రామ్మోహన్ మాట్లాడారు. గ్రామ అభివృద్ధికి గ్రామపంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులు కృషి చేయాలని ఆయన అన్నారు. బస్టాండ్ నుండి స్మశాన వాటిక చివరి వరకు సి సి రోడ్డు నిర్మాణానికి నిధులు ప్రతిపాదనాలు తయారు చేయాలన్నారు.కుర్నపల్లి నుండి ఎడపల్లి వరకు గల ప్రధాన రహదారి రోడ్డు వెడల్పు లో భాగంగా బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి నిధులు మంజూరు చేసేందుకు సముఖంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.మంగళ్ పాడ్ బస్టాండ్ గ్రామంలో చివర దళితవాడ వరకు సి సి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు నకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.ఏది ఏమైనప్పటికీ గ్రామపంచాయతీ పాలకవర్గం పార్టీలకు అతీతంగా ఐక్యతతో ఉండి గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన ఆశ భావ వ్యక్తం చేశారు.అనంతరం సర్పంచ్ దంపతులను అధికారులు గ్రామ పెద్దలు యువకులు ఘనంగా సన్మానించారు.అంగన్వాడి ఉపాధ్యాయులను, గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులను, బిల్ కలెక్టర్ పద్మావతిని, అలాగే ఐకెపి గ్రామ వివో లు కుమ్మరి పుష్ప, జంగం సంధ్యలను సర్పంచ్ వీణ శ్రీనివాస్ గౌడ్ తో పాటు పాలకవర్గం గ్రామ ప్రత్యేక అధికారి ప్రమోద్ కుమార్ ను గ్రామంలోని పెద్దలను యువకులను సన్మానించారు.కార్యక్రమంలో ప్రత్యేక అధికారి ప్రమోద్ కుమార్, గ్రామపంచాయతీ కార్యదర్శి రామిరెడ్డి, గ్రామ పెద్దలు, యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.