ఎడపల్లి సర్పంచ్ ను సన్మానించిన పూర్వ విద్యార్థులు

ఎడపల్లి, డిసెంబర్ 26 ( లోకంతీరు ) : ఎడపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా నియామకమైన కందగట్ల రామచందర్ ను శుక్రవారం పూర్వ విద్యార్థులు మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను అభినందించారు.1989 సంవత్సరం నికి చెందిన పూర్వ విద్యార్థులైన ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న కందగట్ల రామచందర్ సర్పంచ్ గా ఎన్నికైన అనే విషయం తెలుసుకున్న క్లాస్ మెంట్ పూర్వ విద్యార్థులు. ఎడపల్లి చేరుకొని ఆయనకు సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఒకేచోట కలవడంతో సర్పంచ్ కందగట్ల రామచందర్ హర్షం వ్యక్తం చేస్తూ సహా తోటి పూర్వ విద్యార్థులు ప్రస్తుతం ఉపాధ్యాయులను గౌరవించి అభినందించారు. సర్పంచ్ రామచందర్ ను ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు స్వీట్లు పంపిణీ చేశారు. సన్మానించిన వారిలో ఉపాధ్యాయులు వినోద, సంగీత ఝాన్సీ లీల స్వామి బోధన్ మండలం అందాపూర్ జడ్పిహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూర్యకుమార్, తదితరులు పాల్గొన్నారు.