జాతీయ ఓటర్ల దినోత్సవంని పురస్కరించుకొని.
బాల్కొండ నియోజకవర్గస్థాయి పోటీలలో విజేతలు వీరే…

బాల్కొండ, జనవరి 24 ( లోకం తీరు ) : జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని బాల్కొండ నియోజకవర్గ స్థాయి పోటీలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండ లో బుధవారం నిర్వహించడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇందులో బాల్కొండ , మెండోరా. ముప్కాల్, కమ్మర్పల్లి , మోర్తాడ్, ఎర్గగట్ల, వేల్పూర్, భీంగల్ తదితర మండలాల నుంచి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో విజేతలుగా ఉపన్యాస పోటీలలో కమ్మర్పల్లి మండలానికి చెందిన ఎండి ఫాయా జాన్, పోచంపాడు బాలికల గురుకుల పాఠశాల చెందినటువంటి భార్గవి ద్వితీయ స్థానాన్ని సాధించడం జరిగింది. అలాగే వ్యాసరచన పోటీలలో సుహానా బేగం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండ ప్రథమ స్థానాన్ని, ద్వితీయ స్థానాన్ని P సంజన తెలంగాణ రెసిడెన్షియల్ బాలికల గురుకుల పాఠశాల పోచంపాడు విజేతలుగా నిలిచారు. వీరు రేపు ఉదయం జిల్లా కలెక్టరేట్లో 10 గంటలకు రిపోర్ట్ చేయాలని ఈ మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ తెలిపారు. కావున ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారులు ఈ విషయంలో చెరువు తీసుకొని సంబంధిత విద్యార్థులకు సమాచారాన్ని చేరవేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.