లయన్స్ క్లబ్ మోపాల్ వారిచే రగ్గుల పంపిణీ

నిజామాబాదు/మోపాల్, నవంబర్ 17 ( లోకంతీరు ) : మోపాల్ మండలం లోని బి సి హాస్టల్ విద్యార్థులకు రగ్గుల పంపిణీ .లయన్స్ క్లబ్ మోపాల్ వారిచే 55 మంది విద్యార్థులకు రగ్గులు పంపిణి చేసి వారిని చలినుండి కాపాడినారు .ప్రభుత్వం నుండి బి సి హాస్టళ్లకు రగ్గులు పంపిణీ లేనందున పిల్లలను చలి నుండి కాపాడే బాధ్యత మనందరి పై ఉందని పంపిణీ చేయడం జరిగిందని లయన్స్ ప్రతినిధులు తెలిపారు .ఈ కార్యక్రమం లో భగవానులు ,నర్సింహారావు , రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు ,జిల్లా బీసీ అభివృద్ధి అధికారి నర్సయ్య పాల్గొన్నారు .