ఏసీబీకి చిక్కిన….రెవిన్యూ తిమింగలం

కామారెడ్డి, జనవరి 06 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల తహశీల్దార్ యార్లగడ్డ శ్రీనివాస్ రావు ఏసీబీకి చిక్కారు. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ వ్యక్తి వ్యవసాయ భూమిని తన పేరున బదిలీ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. కాగా.. బదిలీ చేయాలంటే డబ్బులు ఇవ్వాలని తహశీల్దార్ డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడి ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం రూ. 50వేల లంచం డబ్బులు అజయ్ అనే ప్రైవేటు వ్యక్తి తీసుకుంటుండగా అనిశా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం తహశీల్దార్ శ్రీనివాస్ రావు, ప్రైవేటు వ్యక్తి అజయ్‌లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టుకు తరలించారు.