Take a fresh look at your lifestyle.

ఫార్మా కంపెనీ రగడ………..

0

ఫార్మా కంపెనీ రగడ…..

ఉద్యమం చేస్తామన్నా రైతులు…

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో, జనవరి 07 ( లోకంతీరు ) :  కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రం రైతులు, గ్రామస్తుల నినాదాలతో మార్మోగింది. ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు బంద్​కు పిలుపునిచ్చారు. పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, లాయర్ల సంఘాలు మద్దతు తెలిపాయి. కామారెడ్డిలో ఏర్పాటు కాబోతున్న ఫార్మా కంపెనీని బిక్కనూరు రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు.ఫార్మా కంపెనీ ఏర్పాటుచేస్తే పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఒకవైపు అధికారులు సేకరణ చేస్తుండగానే, మరోవైపు రైతులు నినాదాలు చేశారు. ప్రజా ఆమోదం మేరకే నిర్ణయాలు ఉంటాయని, నివేదికను త్వరలో ప్రభుత్వానికి పంపిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎనిమిది ఫార్మా కంపెనీలు ఉండగా, మరో కంపెనీని ఏర్పాటుచేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.ఒక వేళ కంపెనీ ఏర్పాటు చేస్తే మేము కచ్చితంగా అడ్డుకుంటామని ,లేని పక్షంలో ఎంతటి ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉన్నామని రైతులు అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.