Take a fresh look at your lifestyle.

36 వ డివిజన్ లో కాంగ్రెస్ ప్రచారం….

0

డివిజన్ అభివృద్ధి యే నా ద్యేయం

– జక్కుల శ్రీలత విజ్ఞేష్ యాదవ్

– స్వాగతిస్తున్న ఓటర్లు….

నిజామాబాద్,  ఫిబ్రవరి 06 ( లోకంతీరు ) : నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో కాంగ్రెస్ ప్రచారం రోజు రోజుకు పుంజుకుంటుంది. శనివారం నగరంలోని 36 వ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్ధి జక్కుల శ్రీలత విజ్ఞేష్ యాదవ్ కు ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. ప్రతి ఓటరుకు ఆప్యాయంగా పలకరిస్తూ వారి కష్టాలు తెలుసుకుంటున్నారు.ఈ సందర్భంగా శ్రీలత విజ్ఞేష్ యాదవ్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు.36 వ డివిజన్ అభివృద్ధి కొరకు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. పదవులు లేనప్పుడే ఎన్నో సేవలు చేశామని, ఒకసారి అవకాశం కల్పించి నిజామాబాద్ 36 వ డివిజన్ కార్పొరేటర్ గా గెలిపించాలని కోరారు.అభివృద్ధి కావాలంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని అన్నారు.చేతి గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.

Leave A Reply

Your email address will not be published.