Take a fresh look at your lifestyle.

డ్రైనేజీ తవ్వారు మరమ్మత్తులు మరచిన గ్రామపంచాయతీ అధికారులు…..

0

డ్రైనేజీ తవ్వారు మరమ్మత్తులు మరచిన గ్రామపంచాయతీ అధికారులు

ఎడపల్లి, ఆగస్టు 31( లోకంతీరు ) :  ఎడపల్లి మండల కేంద్రంలోని నాయబాదిలోనీ కొత్త బస్టాండ్ వార్డులో ప్రధాన రహదారి పక్కన మురికి కాలువ తవ్విన గ్రామపంచాయతీ అధికారులు, సిబ్బంది, పక్షం రోజులైన. మురికి కాలువను డ్రైనేజీ ఏర్పాట్లు, మరమ్మత్తులు చేయలేక పోయారని కానీ వాసులు తీవ్ర ఆగ్రహంతో తమ ఆవేదన వ్యక్తం చేశారు.ఎడపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి ముందర ఉన్న మురికి కాలువ ఏ విధంగా ఉందో అలాగే ఏగువ. ముట్క. నుండి వస్తున్న మురికి నీరు దిగువ స్థాయికి చేరుకునేందుకు గ్రామపంచాయతీ అధికారులు సిబ్బంది అలాగే చర్యలు చేపట్టాలని పదవ వార్డ్ కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాణ పనులు చేపట్టేందుకు పంచాయతీ కార్యదర్శి తో పాటు సిబ్బంది తవ్వకాలు చేపట్టి పక్షం దాటిన ఇంతవరకు ఎలాంటి పనులు జరిపించలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ప్రధాన రహదారి నుండి పదో వార్డులోకి వెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ మోటార్ సైకిల్ తో పాటు ఇతర వాహనాలను మరో వీధి నుండి తమ ఇళ్లలోకి తెచ్చుకునే పరిస్థితి దాపురించింది అంటున్నారు. రాత్రివేళ బోధన్ నిజాంబాద్ ప్రధాన రహదారి ఎడపల్లి మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపాన ఎదురుగా ఉన్న

పదవ వార్డు కాలనీవాసులు మెయిన్ రోడ్డుకు రావాలన్న కూడా ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులు సిబ్బందితోపాటు సంబంధిత మండల స్థాయి అధికారులు మురికి కాలువ వద్ద డ్రైనేజీ ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. లేనిపక్షంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట ఈ వార్డులో ఉన్న కాలనీవాసులందరం తమకు రోడ్డు వేసేంతవరకు ఉన్నత స్థాయి అధికారులకు వినతి పత్రాలు అందిస్తూ ధర్నా చేస్తామని కాలనీ వాసులు అధికారులను హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులతో పాటు అధికారులు స్పందించి తమకు ప్రధాన రోడ్డుకు చేరుకునే విధంగా మురికి కాలువ మరమ్మత్తులు జరిపించి డ్రైనేజీ తోపాటు సైడ్ వాల్ ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.