ఆన్ డ్యూటీనా…. లేక ఆఫ్ డ్యూటీనా….
– ప్రజలకు తప్పని తిప్పలు….


ఆర్మూర్, మార్చి 25 ( లోకంతీరు ) : ఆర్మూర్ మండల కేంద్రంగా ఉన్న ఆర్మూర్ లో మండల రెవిన్యూ అధికారి తను విధులు నిర్వహిస్తున్నడా..లేక సెలవుల్లో ఉన్నాడా అని అర్థం కాక ప్రజలు నాన ఇబ్బందులు పడుతున్నారు. భూమి రిజిస్ట్రేషన్ కొరకు స్లాట్ బుక్ చేసుకొని వారం గడుస్తున్నా అధికారి ఉన్నారా లేరా అని అర్థం కాక రెవిన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులు లేకపోవడంతో గత కొన్ని రోజులుగా రిజిస్ట్రేషన్ లు అలాగే ఉండిపోయినట్లు సమాచారం. ఎమ్మార్వో వొస్తారో రారో అని తెలియక సంధిగ్ధంలో ఉన్నామని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎమ్మార్వో కాకుండా మిగతా సిబ్బంది డీటీ గాని , అపరేటర్ గాని అందుబాటులో లేకపోయేరికి ఇంకా ఇబ్బంది పడుతున్నామని అక్కడికి వచ్చిన ప్రజలు వాపోతున్నారు.కనీసం ఎమ్మార్వో గాని సిబ్బంది గాని ఏ సమయానికి వస్తారో తెలిస్తే మాకు బాగుంటుంది అని స్థానికులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.