జిల్లాలో పదోన్నతి పొందిన కానిస్టేబుల్ లు

నిజామాబాద్ క్రైమ్ , జూన్ 23 ( లోకంతీరు న్యూస్ ) : నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు కానిస్టేబుల్ లు హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ పొందిన వారిని పోలీస్ కమిషనర్ అభినందించారు. వివరాలలోకి వెళితే తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఆదేశానుసారము నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కానిస్టేబుల్ లు హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ పొంది మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్యను కలవడం జరిగింది. గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్నటువంటి ఇద్దరు కానిస్టేబుల్ లు బి.సుదర్శన్, PC : 1705 సి.సి.ఎస్, అటాచ్మెంట్ ఫింగర్ ప్రింట్/క్లూస్ టీం, నిజామాబాద్, ఎన్.ప్రసాద్,PC:1747, పోలీస్ కంట్రోల్ రూమ్, నిజామాబాద్ లు హెడ్ కానిస్టేబుల్ లుగా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారని ఈ సందర్భంగా ప్రమోషన్ పొందినటువంటి హెడ్ కానిస్టేబుల్ లకు పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలియజేశారు.