మంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
– తిర్మాన్ పల్లి లో 5 కోట్లతో రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల
– ఈ నెల 4 న కళాశాల ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న మంత్రి సీతక్క
– ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే




నిజామాబాద్ రూరల్, జులై 03 ( లోకంతీరు న్యూస్ ) : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇందల్వాయి మండలం తిర్మాన్ పల్లి లో రూ .5 కోట్లతో నూతనంగా నిర్మించిన రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవానికి ఈ నెల 4న మంత్రి సీతక్క రానున్న నేపథ్యంలో స్థానిక రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ మేరకు శుక్రవారం కార్యక్రమ స్థలాన్ని సందర్శించి ఏర్పాట్ల పై ఆరా తీశారు.సంబంధిత అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లు సజావుగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతల కిషన్, నాయకులు ఉమ్మాజి నరేష్, పొలసాని శ్రీనివాస్, రాంచందర్ గౌడ్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు అంబర్ సింగ్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.