Take a fresh look at your lifestyle.

SIR ప్రక్రియలో భాగస్వాములైన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి…..

0

SIR ప్రక్రియలో భాగస్వాములైన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

– ఎన్యూమరేషన్ ఫారం ను ఎమ్మెల్యేకు అందజేసిన ఎమ్మార్వో, BLO లు 

– ప్రక్రియను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచన 

– ఏ ఒక్క ఓటు పోకుండా అప్రమత్తంగా పనిచేయాలి 

నిజామాబాద్ , జులై 03 ( లోకంతీరు న్యూస్ ) :  ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (SIR)లో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఎన్యూమరేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మార్వో వినయ్ సాగర్‌తో పాటు బీఎల్‌వోలు రజిత, లావణ్య, నరేష్‌లు ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అధికారులు పూర్తిస్థాయి పారదర్శకతతో, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా, ఏ ఒక్క ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు, బీఎల్‌వోలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.ప్రజలు కూడా ఈ ప్రక్రియకు సహకరించి, అవసరమైన వివరాలను అధికారులకు అందజేసి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.