Take a fresh look at your lifestyle.

బాన్సువాడ తండాల్లో ఘనంగా ‘తీజ్’ వేడుకలు…..

0

బాన్సువాడ తండాల్లో ఘనంగా ‘తీజ్’ వేడుకలు

ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి

బాన్సువాడ , ఆగష్టు 09 ( లోకంతీరు న్యూస్ ) : బాన్సువాడ గ్రామీణ మండలం పరిధిలోని పోచారం తండా, రాంపూర్ తండాల్లో బంజారాల విశిష్ట సంప్రదాయ పండుగ “తీజ్” ఉత్సవాలు అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ సంబరాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

బంజారా సోదరీమణులకు తీజ్ శుభాకాంక్షలు

ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస రెడ్డి గారు బంజారా సోదర, సోదరీమణులందరికీ తీజ్ పండుగ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవని కొనియాడారు. తండావాసుల ఆనందోత్సాహాల మధ్య తాను భాగస్వామి కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

సంప్రదాయ నృత్యంలో పాల్గొన్న పోచారం

తీజ్ వేడుకల్లో భాగంగా బంజారా మహిళలు భక్తిశ్రద్ధలతో, సంప్రదాయ పద్ధతిలో పెంచిన గోధుమ గడ్డి బుట్టలను (తీజ్) ప్రదర్శించారు. ఎమ్మెల్యే శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారు స్వయంగా తీజ్ బుట్టను తలపై ఎత్తుకుని, బంజారా సోదరీమణులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేశారు. ఆయన వారితో కలిసి అడుగులేయడంతో తండాల్లో పండుగ వాతావరణం మరింత రెట్టింపైంది.

పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, బంజారా మహిళలు, యువత మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తండాలు సాంస్కృతిక శోభతో, ఉత్సాహభరిత కోలాహలంతో విలసిల్లాయి.

Leave A Reply

Your email address will not be published.