Take a fresh look at your lifestyle.

స్కూల్ ఫీజులకు కళ్లెం వేయాలి.. స్పష్టమైన విధానం ప్రకటించాలి

0

ప్రైవేట్,కార్పొరేటు పాఠశాలల ఫీజులపై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలి

  • PDSU డిమాండ్

నిజామాబాద్ ,  ఆగష్టు 09 ( లోకంతీరు న్యూస్ ) : ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల నుంచి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని PDSU ఆధ్వర్యంలో రాంపూర్, డిచ్పల్లి మండలం లో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా PDSU జిల్లా అధ్యక్షులు కర్క గణేష్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. అనిల్ కుమార్ మాట్లాడుతూ,రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజుల వివరాలను తప్పనిసరిగా బహిరంగంగా ప్రదర్శించాలని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేయడం,పాఠశాల అధికారిక వెబ్సైట్లో ఉంచాలని అనేది స్వాగతించదగ్గ విషయమన్నారు.అయితే కేవలం ఫీజుల వివరాలను ప్రదర్శించడం మాత్రమే కాకుండా, ప్రతి తరగతికి ఎంత ఫీజు వసూలు చేయాలనే దానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే స్పష్టమైన ఫీజుల పరిమితులను,వివరాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు.తమిళనాడు సీఎం విజయ్ ప్రభుత్వం చేపట్టిన విధానాలను ఆదర్శంగా తీసుకుని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతి తరగతికి సంబంధించిన ఫీజు వివరాలను ప్రభుత్వం ముందుగానే ప్రకటించి, వాటిని తప్పనిసరిగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రస్తుతం అనేక ప్రైవేట్ పాఠశాలలు ట్యూషన్ ఫీజు, అడ్మిషన్ ఫీజు, పుస్తకాలు, యూనిఫాం తదితర పేర్లతో తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతున్నాయన్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వం సమగ్ర ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.ప్రతి విద్యా సంవత్సరానికి ముందే తరగతి వారీగా ఫీజు పరిమితులను ప్రభుత్వం ప్రకటించి, అన్ని పాఠశాలలు అదే పరిమితుల్లో ఫీజులు వసూలు చేసేలా పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించే పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలన్నారు .విద్య అనేది వ్యాపారం కాదని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించి, విద్యార్థుల హక్కులను కాపాడేందుకు ఫీజుల నియంత్రణను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో PDSU జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే. అషూర్, ఎండి.నసీర్,జిల్లా సహాయ కార్యదర్శి అల్గోట్ సృజన్, జిల్లా నాయకులు మణితేజ,కార్తీక్, మున్నా తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.