ఎమ్మెల్యేకు స్వాగతం పలికిన ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఎడపల్లి, నవంబర్ 14 ( లోకంతీరు ) : రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలదారులకుఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బోధన్ నియోజకవర్గ శాసన సభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి కి రాష్ట్ర క్యాబినెట్ హోదా ను ప్రభుత్వం కల్పించడం పట్ల అలాగే ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులుగా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా నియోజకవర్గానికి విచ్చేయడంతో ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు కార్యకర్తలు దుబ్బ తండ జి నాగేందర్ సాఠాపూర్ గేట్లో పూలమాలతో భారీ ఎత్తున స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఎం ఎస్ సి ఫారం, జానకంపేట, ఎడపల్లి జైతాపూర్ ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ తాహెర్, ఎడపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాసరావు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బిల్లా రామ్మోహన్, కిసాన్ కేత్ ఎడపల్లి మండల అధ్యక్షులు శివరాం ప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ కోశాధికారి బొబ్బిలి శ్రీనివాస్, మాజీ సర్పంచులు శంకర్ నాయుడు, విజయ్ కుమార్, నాయకులు రవి గౌడ్, సుండు నర్సయ్య, మైదం ప్రతాపరెడ్డి, ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.