Take a fresh look at your lifestyle.

మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమం….

0

మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమం

  • పచ్చల నడుకుడ గ్రామాలలో 16 సీసీ కెమెరాలు ప్రారంభించిన పోలీస్ కమిషనర్

  • ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసు సిబ్బందితో సమానం

  • సైబర్ నేరాల నియంత్రణ మరియు డ్రగ్స్ నియంత్రణ లో ప్రజలు అప్రమంతముగా ఉండవలెను

వేల్పూర్ / నిజామాబాద్, సెప్టెంబర్ 17 ( లోకంతీరు ) : వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పచ్చల నడుకుడ గ్రామంలో మన ఊరు–మన భద్రత–మన బాధ్యత” కార్యక్రమంలో భాగంగా 16 సీసీ కెమెరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గురువారం సాయంత్రం ప్రారంభించారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ గ్రామంలో ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. “ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం” అని పేర్కొంటూ, కెమెరాల ద్వారా గ్రామంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించి, అవసరమైనప్పుడు తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని, నేరాల నివారణతో పాటు ట్రాఫిక్ నియంత్రణలోనూ సీసీ కెమెరాలు కీలకంగా ఉపయోగపడతాయని వివరించారు.

దుకాణాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు

ప్రజలు తమ ప్రాంతాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీపీ సూచించారు. ముఖ్యంగా దుకాణాల యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ భద్రతను తమ బాధ్యతగా తీసుకుని పోలీస్ శాఖకు సహకరించాలని పిలుపునిచ్చారు.

పోలీస్ శాఖ నిర్వహిస్తున్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. పచ్చల నడుకుడ గ్రామంలో 16 సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డితో పాటు గ్రామ పంచాయతీని సీపీ అభినందించారు.

డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన

గ్రామంలో డ్రగ్స్ నివారణ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సూచించారు. యువత చెడు మార్గాలకు దూరంగా ఉండి సన్మార్గంలో నడవాలని అవగాహన కల్పించారు.అనంతరం రెడ్డీస్ యూత్ గణేష్ మండలి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని యువతకు పలు సూచనలు చేశారు. అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, వేల్పూర్ ఎస్‌ఐ సంజీవ్, సర్పంచ్ కొల్లే నరసయ్య, ఉపసర్పంచ్ రఘుపతి, మాజీ సొసైటీ చైర్మన్ లింభారెడ్డి, గ్రామ ప్రజలు, యువత తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.