Take a fresh look at your lifestyle.

జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్…..

0

జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

నిజామాబాదు / జక్రానపల్లి, డిసెంబర్ 03 ( లోకంతీరు ) :    నేడు  జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య, ఐ.పి.యస్ పర్యవేక్షించి స్థానిక ఎన్నికల నిర్వహణకు అన్ని ముందస్తు ఏర్పాట్లు సజావుగా చేయాలని, పాత నేరస్తులను గుర్తించి బైండోవర్ చేయాలని సూచించారు.ప్రతీ పోలింగ్ స్టేషన్ సిబ్బంది ని స్వయంగా పరిశీలించి కనీస వసతులు కల్పించే విధంగా చూడాలని, పోలీస్ స్టేషన్ రికార్డులు, బ్యారక్లు, అండర్ ఇన్వేస్టిగేషన్ కేసులపై వివులంగా తనిఖీలు చేసి ప్రతీ కేసుకి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏర్పాటు చేసి నాన్యమైన ధర్యాప్తు చేయాలని, పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, ప్రతీ ధరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసి ఫిర్యాదు దారునికి ఒక కాపీ ఇచ్చి సంతకము తీసుకోవాలని అలానే రిజిస్టర్లో కూడా నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ రిసిప్షనిస్టుకు సూచించారు.దానితో పాటు  సైబర్ క్రైమ్ అవగాహణను పాఠశాలలు మరియు కళాశాలలలో సోషల్ మీడియా ద్వారా అవగాహణ నిర్వహించాలని, విలేజ్ పోలీస్ ఆఫీసర్లు ప్రజలతో మమేకమై గ్రామ సమస్యలు తీర్చేవిధంగా పనిచేయాలని, సరిహద్దు ప్రాంతాల్లో పరస్పర సమన్వయం బలపర్చుకోవాలని తెలిపారు. రోడ్ ప్రామాదాల నివారణకు అవగాహణ కార్యక్రమాలు నిర్వహించాలని, యువతలో ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ పై అవగాహణ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అంతేకాకుండా సిబ్బంది ఎప్పుడు హెడ్ క్వార్టర్స్ యందు అందుబాటులో  ఉండాలని, ప్రతీ 6 నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేసుకోవాలని, ద్విచక్రవాహణం నడిపే సమయంలో హెల్మేటు తప్పనిసరిగ్గా ధరించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో జక్రాన్ పల్లి ఎస్.ఐ జి. మహేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.