Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవం..కొత్తపల్లి

0

కొత్తపల్లిలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

 

   

కోటగిరి, జనవరి 26 ( లోకం తీరు ) : 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కోటగిరి మండలంలోని కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం  ప్రాంగణంలో సొసైటీ చైర్మన్ డా.సునీల్ కుమార్ చౌదరి జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన కొత్తపల్లి సొసైటీ పరిధిలోని రైతులకు,ఉమ్మడి కోటగిరి మండల ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలను తెలిపారు.అనంతరం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం,వివిధ కుల సంఘ భవనాలు,గ్రామ పంచాయతీ,చివరిగా ప్రభుత్వ పాఠశాల వద్ధ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ క్రీడల్లో గెలిచిన వారికి ఆయన బహుమతులు ప్రధానం చేశారు. తదుపరి విద్యార్థులకు అక్కడికి విచ్చేసిన పెద్దలకు గ్రామస్తులకు భోజన ఏర్పాటు చేశారు.ఈ కార్యక్ర మాలలో గ్రామ సర్పంచ్ గడ్డం భారతి,ఎంపీటీసీ సరిత మారుతి,సొసైటీ డైరెక్టర్లు పులిచెర్ల లక్ష్మారెడ్డి, పీరాజీ నాయక్,దుభాస్ కృష్ణ,నీరడి శంకర్,సుభాష్ పటేల్,గ్రామ పెద్దలు,సొసైటీ సభ్యులు,స్కూల్ హె డ్మాస్టర్ ఆలూరు సుభాష్,విద్యార్థులు,కుల సంఘా ల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.