తిమ్మాపూర్ లో ప్రణాళికాబద్ధంగా కొనసాగుతున్న SIR ప్రక్రియ
SIR ప్రక్రియలో అధికారుల వేగవంతమైన చర్యలు

నిజామాబాద్ / మోర్తాడ్, జులై 11 ( లోకంతీరు న్యూస్ ) : మండకేంద్రంలో సర్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుంది.శనివారం ఆదిలాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సోమరాజేశ్వర్ తన స్వంత గ్రామం తిమ్మాపూర్ లోని పొలింగ్ స్టేషన్ లో ఎన్యూమరేషన్ పత్రాలను బిఎల్ఓ లకు ,సూపర్వైసర్ లకు అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క ఓటరు ఇంటికి వెళ్లాలని బీఈవోలను కోరారు. స్థానిక సమస్య ఏదైనా ఉంటే బిఎల్ఓ కు వివరించాలన్నారు.ప్రతి ఒక్కరు వారికి సహకరించాలని , అలాగే సూపర్వైజర్లు ప్రతి అప్లికేషన్ పూర్తిస్థాయిలో గమనించి అప్లికేషన్ ఫామ్ లో ఎటువంటి సమస్యలు లేకుండా పూర్తి చేయాలని కోరారు.ఈ ప్రక్రియ ఈనెల 24 వరకు కొనసాగుతుందని తదనంతరం ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వారికి సుమారు 60 రోజుల వరకు సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని అన్నారు .కాబట్టి ఓటర్లు ప్రతి ఒక్కరూ తొందరగా పూర్తి చేసి బిఏల్ఓ లకు అప్పగించాలన్నారు. ఎవరైనా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పూర్తి చేసినట్లయితే వారు కూడా బిఎల్ఓ లకు సంబంధిత పత్రాలను ధ్రువీకరించుకోవాలని అన్నారు.