SIR ప్రక్రియను పర్యవేక్షించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
-
ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి
-
ఈ నెల 20 వరకే డెడ్ లైన్ పెట్టుకోండి
-
ఎక్కడ కూడా అలసత్వం వహించొద్దు
-
దూస్ గాం గ్రామ పంచాయతీలో SIR ప్రక్రియ పరిశీలన

నిజామాబాద్ రూరల్ , జులై 11 ( లోకంతీరు న్యూస్ ) : డిచ్ పల్లి మండలం దూస్ గాం గ్రామ పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న SIR) ప్రక్రియను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి పర్యవేక్షించారు. ఈ మేరకు శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి ప్రక్రియను పరిశీలించారు.స్థానిక ఎమ్మార్వో నుండి పలు వివరాలు అడిగి తెలుసుకొని.. పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరికి ఎన్యూమరేషన్ ఫారం అందించి తిరిగి సేకరించేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు.
మండల వ్యాప్తంగా దాదాపు 60 శాతం దూస్ గాం లో సైతం 60-70 శాతం ప్రక్రియను పూర్తి చేయడం అభినందనీయమన్నారు. ఇదే స్పూర్తితో వంద శాతం ప్రక్రియను పూర్తి చేయాలని ఈ నెల 24 వ తేదీ వరకు గడువు ఉన్నప్పటికీ 20 లోపే డెడ్లైన్ పెట్టుకుని పూర్తి చేయాలని సూచించారు.
అటు SIR ప్రక్రియలో సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులని అడిగి తెలుసుకున్నారు. అధికారులకు సహాయంగా BLA లు సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
ఓటుహక్కు ప్రవాస్వామ్య దేశంలో అత్యంత విలువైనదని తెలిపిన ఎమ్మెల్యే.. ఏ ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు మెలగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంబర్ సింగ్, మునిపల్లి సాయ రెడ్డి, అమృతపూర్ గంగాధర్, భాస్కర్ రెడ్డి, ఉమ్మాజి నరేష్, పొలసాని శ్రీనివాస్, తారాచంద్ నాయక్, రాంచందర్ గౌడ్, ఉమ్మాజి నరేష్, స్థానిక సర్పంచ్ సువర్ణ-వెంకటేష్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.