Take a fresh look at your lifestyle.

అత్యవసర సమయంలో అండగా సీఎం సహాయనిధి…..

0

అత్యవసర సమయంలో అండగా సీఎం సహాయనిధి

–  5 లక్షల ఎల్.ఓ.సి లెటర్ ను అందజేసిన ఎమ్మేల్యే డా.ఆర్. భూపతి రెడ్డి

నిజామాబాద్, జులై 11 ( లోకంతీరు న్యూస్ ) : నిరుపేదలకు అత్యవసర సమయంలో కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని నిజమాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. ధర్పల్లి మండలం రామడుగు గ్రామానికి చెందిన నాగుల లక్ష్మణ్ అనారోగ్య సమస్యలతో.. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్ర చికిత్స నిమిత్తం రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించారు. దీంతో రూ.5 లక్షలకు సంబంధించి ఎల్.ఓ.సి లెటర్ ను బాధితుడికి ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం అందజేశారు.
ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులతో పాటు పలువురు పార్టీ నాయకులు గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.