Take a fresh look at your lifestyle.

కూలిపోయిన ఇళ్లను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు….

0

కూలిపోయిన ఇళ్లను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు 

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 02 ( లోకంతీరు) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడిన ప్రభావంతో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని పలు గ్రామాలలో కూలిపోయిన ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా గ్రామాలలో కూలిపోయిన ఇళ్ళను పరిశీలించారు. మండలంలోని బిక్నూర్ గ్రామంలో బ్యాగరీ అత్తయ్య, చాకలి లక్ష్మీ సంగమేశ్వర్ కూలిపోయిన ఇండ్లను పరిశీలించారు. శిథిలావస్థలలో ఉన్న ఇళ్లలో ఉండకూడదని సూచించారు. పునరవాస కేంద్రాలకు తరలించే విధంగా ఏర్పాటు చేశారు. కూలిపోయిన ఇళ్లను ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కురుమల సాయిబాబా మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షం పడుతున్నప్పుడు రైతులు ప్రజలు చెట్ల కింద ఉండొద్దని వర్షాకాలంలో కరెంట్ పోల్స్ కానీ ఇలాంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులను తడితో ముట్టుకోవద్దని చెప్పారు. రైతులు పొలాలలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ వైర్లు ముట్టుకోవద్దని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, తమకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న స్థానిక ప్రజా ప్రతినిధులకు, ఎమ్మెల్యే మదన్మోహన్ హెల్ప్ లైన్, అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మండల ప్రజలకు కోరారు. ఆయన వెంట సృజన్ గౌడ్, బోయిని నారాయణ, చందు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.