నిజామాబాదు జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల దాడులు
– పలు రెస్టారెంట్లపై, పలు హోటల్స్, పలుమిర్చి పసుపు తయారీ కేంద్రాలపై,స్వీట్ హౌస్ ల పై దాడులు

నిజామాబాద్, అక్టోబర్ 19 ( లోకంతీరు ) : తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రోహిత్ రెడ్డి ,పి.స్వాతి, శీర్షిక లతో కూడిన బృందం పర్యటన నిజామాబాద్ పట్టణంలోని లహరి మరియు వంశీ ఇంటర్నేషనల్ హోటల్స్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లహరి ఇంటర్నేషనల్ రెస్టారెంట్ నందు రిఫ్రిజిరేటర్ లో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం సరైన ఉష్ణోగ్రతను మైంటైన్ చేయకపోవడమ్, మరియు ఫుడ్ గ్రేడ్ లేని ప్లాస్టిక్ కవర్లలో భారీగా 122.5 kgs,30 వేల రూపాయల విలువ కలిగిన కుళ్ళిన మాంసపు ఉత్పత్తులను నిలువ చేసి, హానికర ప్రమాదకరమైన రంగులను కలిపిన చికెన్ మరియు24,200, విలువ గలిగిన మసాలా మిర్చి పేస్ట్ లను ఫంగస్ బూజు పట్టిన కూరగాయలను గుర్తించడంతో హోటల్ యాజమాన్యం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అప్పటికప్పుడే ప్రజల ఆరోగ్యానికి భంగం కలవకూడదని మాంసపు ఉత్పత్తులను ధ్వంసం చేసి నోటీసులు జారీ చేయడం జరిగింది. అలాగే వంశీ ఇంటర్నేషనల్ హోటల్ నందు 24 వేల విలువగల ఫ్రిడ్జ్ రిఫ్రిజిరేటర్లు నిల్వ ఉంచిన హానికరమైన రంగులతో కూడిన మాంసపు ఉత్పత్తులు ఉడకబెట్టిన మిర్చి పేస్ట్ కాలం చెల్లిన మసాలాపొడులు ధ్వంసం చేయడం జరిగింది, తర్వాత ఆహార పదార్థాలు తయారు మరియు నిల్వ చేసే కిచెన్ సరేనటువంటి వెలుతురు లేకుండా పూర్తిగా అపరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తూ వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న హోటల్ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో మండిపడి పలు ఎఫ్ఎస్ఎస్ఏ కి సంబంధించిన నోటీసులు జారీ చేయడం జరిగింది. పలు అనుమానాస్పద శాంపుల్స్ ని సేకరించడం జరిగింది.మిర్చి కాంపౌండ్ లోని పలు మసాలా కారం పసుపు తయారీ కేంద్రాలపై దాడులు జరిపి అనుమానాస్పద శాంపులను సేకరించి ల్యాబ్ కు తరలించడం జరిగింది మరియు ఇంప్రూవ్మెంట్ నోటీసెస్ మరియు పలు ఫుడ్ సేఫ్టీ నోటీసులను జారీ చేయడం జరిగింది.ఢిల్లీ వాలా స్వీట్ హౌస్ నందు కూడా ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అపరిశుభ్ర వాతావరణం చూసి అధికారులు విస్తుపోయి స్వీట్ హౌస్ యాజమాన్యంపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం హెడ్ ఐన వి.జ్యోతిర్మయి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు నోటీసులు జారీ చేసి అనుమానిత సేకరించి ల్యాబ్ కి తరలించడం జరిగింది. ఈ రకమైన ప్రజారోగ్యంతో చెలగాటమాడే ఆహార తయారీదారులు మరియు ఆహారం అమ్మేవారు ఎంతటి వారైనా సురక్షితమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని హెచ్చరిస్తూ లేనియెడల చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ అవసరమైతే సంబంధిత శాఖ సహాయంతో సీజ్ కూడా చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ దాడులలో అధికారులతో పాటు పలువురు సిబ్బంది పాల్గొనడం జరిగింది.